విషయం తెలిసి షాకై ప్రధాని కి ఫోన్ చేశా: మమతా బెనర్జీ

వాస్తవం ప్రతినిధి:  డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించడం తో కావేరి ఆసుపత్రిలో నిన్న తుది శ్వాస  విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరపాలని భావించగా దానికి తొలుత అక్కడి ప్రభుత్వం అంగీకరించని సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై షాకైన తాను వ్యక్తిగతంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్‌ చేశానని పశ్చిమ్‌బంగా‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

‘మెరీనా బీచ్‌లో కరుణానిధి అంతిమ సంస్కారాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిసి, నేను చాలా బాధపడ్డాను. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడడానికి ఫోన్‌ చేశాను. కానీ, ఆయన అందుబాటులో లేరని ఆయన సిబ్బంది చెప్పారు. దీంతో నేను ఈ విషయంపై మాట్లాడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్‌ చేశాను’ అని ఆమె మీడియాకు తెలిపారు. కరుణా నిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్ లో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన అంత్యక్రియలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరిక్‌ ఒబ్రెయిన్‌ హాజరుకానున్నారు. కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్‌లో జరిపేందుకు మొదట ప్రభుత్వం అంగీకరించకపోయినప్పటికీ మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.