‘నర్తనశాల’ టీజర్ రిలీజ్

వాస్తవం సినిమా: ‘ఛలో’ సినిమా విజయవంతం కావడంతో మరింత ఉత్సాహంగా హీరో నాగశౌర్య, శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం లో తన సొంత బ్యానర్లోనే ‘నర్తనశాల’ సినిమా చేశాడు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన కశ్మీర పరదేశి .. యామిని భాస్కర్ నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను పరిచయం చేస్తూ కట్ చేసిన ఈ టీజర్, హాస్య ప్రధానంగా కొనసాగింది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలా పెంచబడిన హీరో .. అమ్మాయిలకి దూరంగా ఉంటూ వుంటాడు. ఫలితంగా చోటుచేసుకునే సరదా సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగుతుందనే విషయం టీజర్ వలన స్పష్టమవుతోంది. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా .. వినోదమే ప్రధానంగా రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.