విషమంగా కరుణానిధి ఆరోగ్యం

వాస్తవం ప్రతినిధి: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది. తాజాగా ఆయన చికిత్స పొందుతున్న చెన్నైలోని కావేరి ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. వయసు సమస్యల దృష్ట్యా కరుణానిధి శరీరంలోని కీలక అవయవాలను సాధారణ స్థితికి తీసుకురావడం ఇబ్బందిగా మారుతోందని వైద్యులు తెలిపారు. రానున్న 24 గంటల్లో చికిత్సకు స్పందించిన రీతిని బట్టి తదుపరి ట్రీట్‌మెంట్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం క్రిటికల్ కేర్‌లో ఉన్న కరుణానిధిని అబ్జర్వేషన్‌లో పెట్టినట్లు హాస్పటల్ యాజమాన్యం తెలిపింది. వైద్యులు ఇలా పేర్కొనడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మరోమారు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు కరుణానిధి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా కావేరీ ఆసుపత్రికి వస్తున్నారు.