నాగ్,నాని మల్టీ స్టారర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల!

వాస్తవం ప్రతినిధి: టాలీవుడ్ లో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతుంది. మల్టీ స్టారర్ మూవీ లు చేయడం లో ఎప్పుడూ ముందుండే నాగ్ ఈ మూవీ కూడా కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రముఖ హిరో సూర్య తమ్ముడు, హిరో కార్తీ తో కలిసి నాగ్ చేసిన ఊపిరి సినిమా ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పడు తాజాగా టాలీ వుడ్ క్లాస్ హిరో నాని తో కలిసి నాగ్ తాజా ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్‌ మూవీ దేవదాస్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగార్జున, నాని బెడ్ పై నిద్రిస్తున్నారు. అయితే ఈ పోస్టర్ లో నాగ్ ఓ చేతిలో గన్, మరో చేతిలో వైన్ బాటిల్ పట్టుకోగా..నాని మెడలో స్టెతస్కోప్ తో ఉన్నాడు.  సరికొత్తగా ఉన్న ఈ లుక్ దేవదాస్ పై అంచనాలను పెంచేస్తుంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ లోగోకు మంచి రెస్సాన్స్‌ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.