ఈ సినిమాతో ఆ కోరిక తీరింది: రాశీఖన్నా

వాస్తవం సినిమా: ‘తొలిప్రేమ’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీఖన్నా ఈ నెల 9న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానుంది. సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. ప్రేమ, పెళ్లి. సాంప్రదాయాల నేపథ్యంలో జరిగే ఈ సినిమా పట్ల రాశీఖన్నా చాలా ఎగ్జైటింగా ఉన్నారు. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి అనేది ఒక గొప్ప అనుభవం.. అదెలా ఉంటుందో తెలిసేలా చేశారు మా దర్శకుడు సతీష్ వేగేశ్న. సినిమా చూసిన తర్వాత ఆయన పాదాల్ని తాకాను. అంత గొప్పగా తీశారు ఆయన సినిమాను. తొలిప్రేమ లాంటి సినిమా తర్వాత మంచి పాత్రను చేయాలనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది’ అన్నారు. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మరొక నటి నందిత శ్వేత కీలక పాత్రలో నటించగా మిక్కీ జె సంగీతాన్ని అందించారు.