జెట్ ఎయిర్ వేస్ పైలట్ల లైసెన్సు లను రద్దు చేసిన పౌర విమానయాన శాఖ!

వాస్తవం ప్రతినిధి: జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన ఇద్దరు పైలట్ల లైసెన్సును పౌర విమానయాన శాఖ రద్దు చేసినట్లు తెలుస్తుంది. సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంలో.. రన్‌వేకు సమాంతరంగా ఉన్న ట్యాక్సీవే నుంచి విమానాన్ని అక్మస్తాత్తుగా టేకాఫ్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో ఆ ఇద్దరు పైలట్ల లైసెన్సు లను పౌర విమానయాన శాఖ రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఈనెల 3న జరిగిన ఈ ఘటన పట్ల సివిల్ యేవియేషన్ శాఖ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో ముంబయికి రావాల్సిన జెట్ ఎయిర్‌వేస్ విమానంలో 148 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే రన్‌వేపై వెళ్లకూడదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పైలట్లు తృటిలో పెను ప్రమాదాన్నితప్పించారు.