కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూత!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం నెలకొని ఉంది. కేసీఆర్ సోదరి లీలమ్మ ఈ రోజు కన్నుమూశారు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌.. సోదరి మరణవార్త తెలిసిన హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. సీఎం కేసీఆర్‌కు ఎనిమిది మంది అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న ఉన్నారు.