కన్నడిగుల సినిమాలో మిల్కీ బ్యూటీ కి బంపర్ ఆఫర్

వాస్తవం సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా కన్నడ పరిశ్రమపై దృష్టి సారించింది. అక్కడ అదిరిపోయే ప్యాకేజీని ఆఫర్ చేస్తే నటించేందుకు సిద్ధమవుతోంది.అప్పట్లో బెల్లంకొండ అల్లుడు శీనులో – ఆ తర్వాత ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో అదిరిపోయే ఐటెమ్ నంబర్లతో దుమ్ము దులిపేసింది. వీటికి పారితోషికం అంతే భారీగా ముట్టజెప్పారట. తాజాగా కన్నడ యువహీరో యశ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కెజిఎఫ్ లో ఓ ఐటెమ్ నంబర్ లో నర్తించే అవకాశం తమన్నా అందుకుంది. వచ్చే వారం ఈ పాటను తెరకెక్కించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబేల్ పిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు – తమిళ్ – మలయాళం – హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. 2016లో జాగ్వార్ సినిమాలో ఐటెమ్ నంబర్ లో నర్తించిన తమన్నా ఇప్పుడు రెండోసారి కన్నడిగుల సినిమాలో ఐటెమ్ నంబర్ చేసేందుకు సంతకం చేసింది.