స్వేచ్చా వాణిజ్యానికి మద్దతు గా చేతులు కలిపిన చైనా,ఇయు

వాస్తవం ప్రతినిధి: బహుళవాదాన్ని ప్రోత్సహించేందుకు, స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతుగా చేతులు కలపాలని చైనా, యురోపియన్‌ యూనియన్‌(ఇయు) శుక్రవారం అంగీకరించినట్లు తెలుస్తుంది. ఆసియాన్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా చైనా స్టేట్‌ కౌన్సెలర్‌, విదేశాంగ మంత్రి వాంగ్‌ యి, యురోపియన్‌ యూనియన్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి ఫెడెరికా మొగెరినితో భేటీ అయిన సందర్భంగా ఈ అంగీకారం కుదిరింది. ఇటీవలే చైనా, ఇయు నేతలు బీజింగ్‌లో చర్చలు జరిపారని, నిబంధనలతో కూడిన బహుళవాద వాణిజ్య వ్యవస్థను పరిరక్షించేందుకు ఉభయ పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని వాంగ్‌ తెలిపారు. వాణిజ్య రక్షణవాదాన్ని, ఏకపక్షవాదాన్ని ప్రతిఘటించాలని వారు అభిప్రాయపడ్డారు.