తిరునెల్వేలి లో ట్రాక్టర్‌ నడిపి సందడి చేసిన మహేంద్ర సింగ్ ధోనీ 

వాస్తవం ప్రతినిధి: మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై లోని తిరునెల్వేలిలో సందడి చేశారు. టీఎన్‌పీఎల్‌ ప్రారంభోత్సవంలో భాగంగా  తిరునెల్వేలిలో పర్యటించిన ధోని… తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేసి అందరినీ అలరించారు. అలానే అక్కడ ట్రాక్టర్‌ కూడా నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం గుండారు జలపాతంలో జలకాలాడారు. ఈ నేపధ్యంలో ధోనీ ని చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.