అక్రమంగా తరలిస్తున్న నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

వాస్తవం ప్రతినిధి:బంగ్లాదేశ్ కు అక్రమంగా తరలిస్తున్న 1125 నక్షత్ర తాబేళ్లను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు వ్యక్తులు వీటిని తరలిస్తున్నారన్న అందిన పక్కా సమాచారంతో విశాఖ రైల్వేస్టేషన్‌లో యశ్వంత్‌పూర్‌- హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించారు. ఎస్‌7 బోగీలో మూడు సంచుల్లో తాబేళ్లను తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి, సరిహద్దు ప్రాంతమైన కర్నాటకలో వీటిని సేకరించి తరిస్తున్నట్లు వెల్లడైందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. వివిధ రకాల సైజుల్లో ఉన్న వీటిని బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.