రెండో సి డబ్ల్యూసీ సమావేశం……సోనియా గైర్హాజరు!

వాస్తవం ప్రతినిధి: రాహుల్‌గాంధీ అధ్యక్షత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం ఢిల్లీ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం లో జరిగింది. ఈ సమావేశానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ సహా పార్టీ సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకాకపోవడం విశేషం. సోనియా స్వల్ప అస్వస్థతత కు గురయ్యారని,అందుకే సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన తరువాత రాహుల్ గాంధీ నేతృత్వం లో జరుగుతున్న రెండో సిడబ్ల్యూసీ సమావేశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అసోం జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదా వివాదం, రాఫెల్‌ ఒప్పందం తదితర కీలక విషయాలపై ఈ కమిటీలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.