జగన్ పాదయాత్ర @ 228 వ రోజు

వాస్తవం ప్రతినిధి: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకై వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే కాగా, శనివారంతో 228వ రోజుకు చేరుకుంది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్‌ రోడ్‌ నుంచి యాత్ర ప్రారంభమైంది. వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.