ఒకేసారి సుప్రీం కోర్టు లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు!

వాస్తవం ప్రతినిధి: సుప్రీం కోర్టు చరిత్రలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఒకే సారి నియమించబడ్డారు. 68 ఏండ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇలా ఒకేసారి ముగ్గురు మహిళా న్యాయమూర్తులు నియమించబడడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొన్నటి వరకు ఇద్దరు మహిళా న్యాయమూర్తులు జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందూ మల్కోత్రా ఉండే వారు. అయితే ఇప్పుడు వారికి తోడుగా జస్టిస్ బెనర్జి ని కూడా నియమించడం తో సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. అందులో మొదటి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ కాగా, అనంతరం సుజాతా మనోహర్, రమాపాల్, సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్, బానుమతి, ఇందు మల్హోత్రాలు ఉన్నారు. అయితే ఇందులో మరో విశేషం ఏమిటంటే ఇందులో అందరూ దాదాపు ఒంటరి మహిళా న్యాయమూర్తిగానే కొనసాగారు.