లోకేష్ మంత్రిగా ఉండడం వల్లే ఏపీ కి ఐటీ కంపెనీలు

వాస్తవం ప్రతినిధి: నారా లోకేష్‌ను మంత్రిగా తీసుకోవడం వల్లే ఎపికి ఐటీ కంపెనీలు వస్తున్నాయని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌రావు వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాల్లో విఫలమైన ఈ నిరుద్యోగ భ్రుతి అమలుతో టిడిపి మేనిఫెస్టో 99 శాతం అమలైనట్లేనని ఆయన అన్నారు. అలానే బిజెపి పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు. వీర్రాజు వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వం తెలుసుకుంటుందన్నారు. ప్రజల్లో మమేకం అవ్వడానికి గ్రామదర్శిని ప్రజాప్రతినిధులకు ఒక మంచి అవకాశం అని డొక్కా తెలిపారు.