ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్

వాస్తవం ప్రతినిధి: ఉద్యోగావకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో కొత్త జోనల్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ జోనల్ వ్యవస్థ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పయనమయ్యారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. అలాగే గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు, ఉమ్మడి హైకోర్టు విభజన సహా కేంద్రం ఇచ్చిన ఇతర హామీలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా వంటి అంశాలపైనా ఆయన ప్రధాని తో చర్చించనున్నారు.