కియరా ఆ హీరో తో పీకల్లోతు ప్రేమలో ఉందట

వాస్తవం సినిమా: సూపర్ స్టార్ మహేష్ సరసన ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ కియరా అద్వాని. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ మల్ హోత్రాతో ప్రేమలో ఉందనే వార్త తాజాగా ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది.ఇంతకుముందు సిద్దార్ధ్ అలియా భట్ తో ఎఫైర్ నడిపినట్టు వార్తలు రాగా ఆమెను వదిలి కొన్నాళ్లు జాక్వెలిన్ తో తిరిగాడు. ఇప్పుడు లేటెస్ట్ గా కియరాతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడట . ఈమధ్యనే అమ్మడు బర్త్ డేకు సిద్ధార్థ్ రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చింది.
తెలుగులో మహేష్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కియరా ఛాన్స్ వస్తే తమిళంలో కూడా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. మరి కెరియర్ మంచి ఫాంలో ఉండగా ప్రేమ దోమా అంటూ ట్రాక్ తప్పకుండా అమ్మడు ఫోకస్ పెడితే మాత్రం టాప్ రేంజ్ కు వెళ్తుందని అంటున్నారు.