ఆఫ్ఘానిస్తాన్ లో దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులు!

 వాస్తవం ప్రతినిధి: ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని అంతర్జాతీయ ఆహార సంస్థలో పని చేస్తున్న ముగ్గురు విదేశీయులను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి, చంపారని గురువారం అక్కడి భద్రతా అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఒక దౌత్యవేత్త కూడా స్పష్టం చేశారు.  వీరంతా ప్రపంచలో రెండవ అతిపెద్ద ఆహార క్యాటరింగ్‌ సర్వీసెస్‌ సంస్థ సెడేక్స్‌లలో పనిచేస్తున్నారని సీనియర్‌ దౌత్యవేత్త ఒకరు వెల్లడించారు. భారత్‌, మలేషియా, మసిడోనియన్‌కు చెందిన పౌరులను అపహరించి, హత్య చేశారని తెలిపారు. వారి మృతదేహాలు లభ్యమయ్యాయని కాబూల్‌ పోలీస్‌ చీఫ్‌ హస్మత్‌ స్ట్రానెకాజ్‌ తెలిపారు. వారి మృతదేహాలకు పక్కన వారి గుర్తింపు కార్టులను కనుగొన్నామని, నిర్దారణ కోసం కంపెనీ అధికారులను సంప్రదించామని, కానీ వారు అందుబాటులో లేరని భద్రతా సిబ్బంది తెలిపారు. దీనికి సంబందించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.