హజ్ యాత్రకు బయలుదేరిన తొలి బృందం

వాస్తవం ప్రతినిధి: హజ్ యాత్రకు తొలి బృందం బయలుదేరింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హజ్ టర్మీనల్ లో బుధవారం ఉదయం 7:30 గంటలకు ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, హజ్ కమిటీ చైర్మన్ మసిఉల్లహ ఖాన్, సెంట్రల్ హజ్ కమిటీ సభ్యుడు ఎం ఎం అష్రాఫ్, డిప్యూటీ మేయర్ సిరాజ్(వరంగల్) శుకుర్ సాబ్, షఫీ కార్పొరేటర్ మరియు ఇతర ఉన్నత అధికారులు పచ్చ జెండా ఊపి మరి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 7800 మంది హజ్ యాత్రికులు వెళ్తున్నారని తెలిపారు. ఈ రోజు నుంచి ఆగస్ట్ 16 తేదీ వరకు యాత్ర కొనసాగుతుందని, ప్రతి విమానంలో 300 వందల మంది చొప్పున హజ్ యాత్రకు వెళ్తారని వెల్లడించారు.