విజయవంతంగా ముగిసిన సికింద్రాబాద్ బోనాలు: మంత్రి తలసాని

వాస్తవం ప్రతినిధి: సికింద్రాబాద్ బోనాలు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. తెలంగాణా సర్కార్ నగరంలో బోనాల నిర్వహణ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. సికింద్రాబాద్ బోనాలు విజయవంతంగా ముగిశాయని  ఇవాళ తలసాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ…..అమ్మవారికి సంప్రదాయబద్దంగా బోనం సమర్పించినట్లు చెప్పారు. సికింద్రాబాద్ బోనాలకు ఊహించని విధంగా లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్నందునే స్థలం సరిపోవటం లేదు. భక్తులు అధికంగా రావడంతోనే కొంత సమస్య తలెత్తిందన్నారు. అన్ని శాఖల అధికారులు, పోలీసులు బాగా పనిచేశారని తలసాని చెప్పారు. ఇప్పటి అనుభవాల దృష్ట్యా భవిష్యత్‌లో జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆలయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.15 కోట్లు వివిధ బస్తీల్లోని ఆలయాల అభివృద్ధి కోసం ఇచ్చారని తలసాని పేర్కొన్నారు.