వచ్చే ఏడాది జనవరి లో న్యూజిలాండ్ లో పర్యటించనున్న టీమిండియా

వాస్తవం ప్రతినిధి: ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు తో తలపడుతున్న టీమిండియా వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో భారత క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో మహిళల జట్టు కూడా కివీస్‌లోనే పర్యటించనుంది. తాజాగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ ఏడాది డిసెంబరు చివరి వారం నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఆ దేశ పురుషుల, మహిళల జట్లు సొంతగడ్డపై ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఆతిథ్య జట్టుతో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. భారత మహిళల జట్టు మాత్రం మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నట్లు సమాచారం.