ముగాబే లేకుండా తొలిసారి జింబాబ్వే లో అధ్యక్ష ఎన్నికలు!

వాస్తవం ప్రతినిధి: జింబాబ్వే అధ్యక్షుడిగా కొన్నేళ్ళ పాటు సేవలు అందించిన రాబర్ట్ ముగాబే ను ఇటీవల ఆ పదవి నుంచి బలవంతంగా దించేసిన సంగతి తెలిసిందే. అయితే రాబర్ట్‌ ముగాబే బరిలో లేకుండా తొలిసారి జింబాబ్వే లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 85 శాతం దాకా ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలు కావడానికి మూడు గంటల ముందు నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని బారులు తీరారు. కొత్త అధ్యక్షునితో బాటు 120 పార్లమెంటు స్థానాలకు, 9వేలకు పైగా కౌన్సిలర్ల స్థానాలకు సోమవారం ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసినట్లు తెలుస్తుంది.