మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే!

వాస్తవం ప్రతినిధి: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులను, రోహింగ్యాల గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు,రోహింగ్యాలు గౌరవంగా దేశం విడిచిపోకపోతే,అప్పుడు వారిని కాల్చేస్తేనే దేశం క్షేమంగా ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అసోంలో నివసిస్తున్న వారిలో 40 లక్షల మంది సాంకేతికంగా ఈ దేశ పౌరులు కారని జాతీయ పౌర రిజిస్ట్రర్(ఎన్‌ఆర్సీ) తేల్చిన సందర్భంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పైవిధంగా స్పందించారు. 3.29 కోట్ల రాష్ట్ర జనాభాలో 2.89 కోట్లమంది మాత్రమే భారత పౌరులని వెల్లడించింది. ఉద్రిక్తతల మధ్య ఎన్‌ఆర్సీ తుది ముసాయిదా సోమవారం విడుదలైంది. దీంతో జాబితాలో చోటుదక్కని 40 లక్షల ఏడువేల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.