ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ కన్నుమూత

వాస్తవం సినిమా: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ (105) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. 1913 డిసెంబర్‌ 9న జన్మించిన కే.రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. ఆయన ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలు అందించిన రాఘవ.. 1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. కోల్‌కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన.. జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. తాతామనవడు,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,సంసారం సాగరం,జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్య చంద్రులు, అంతులేని వింతకథ, జగత్ జంత్రీలు, వంటి సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు.