“నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశా”: అతిథిరావు

వాస్తవం సినిమా: సుధీర్ బాబు హీరోగా న‌టించిన ‘స‌మ్మోహ‌నం ‘ సినిమాతో రీసెంట్‌గా హిట్ కొట్టింది అతిథిరావు హైదరి.ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వ‌రుస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతు ,తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాన‌ని తెలిపింది.పూర్తి వివ‌రాల‌లోకి వెళ్లితే….2006లో ఓ మలయాళ సినిమా ద్వారా నటిగా పరిచయమైన అతిథి ఆ తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. కెరీర్ ఆరంభంలో ఓ బాలీవుడ్ నిర్మాత నా దగ్గరకు వచ్చాడు.ఆఫర్ ఇస్తానని,త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని కోరాడు.నాకు చాలా కోపం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే అలా అడుగుతాడు. అలాంటి తప్పుడు దారుల్లో వెళుతూ అవకాశాలు దక్కించుకోవడం అవసరమా అనిపించింది. అందుకే చాలా రోజులు ఖాళీగా ఉండిపోయాను.టాలెంట్ ఉంటే అవ‌కాశాలు అవే వ‌స్తాయ‌ని,ఇలాంటి త‌ప్పుడు ప‌నులు చేసి సినిమాలు చేయ‌కుడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని అతిథిరావు తెలిపింది. అతిథిరావు ప్ర‌స్తుతం తెలుగులో మూడు సినిమాల‌లో న‌టిస్తుంది.