త్వరలోనే ప్రియమణి ఓ శుభవార్త చెబుతుందట

 వాస్తవం సినిమా: తెలుగుతో పాటు పలు ఇతర భాషా చిత్రాల్లో కూడా వెండితెర మెరుపులు మెరిపించింది ప్రియమణి. స్టార్ హీరోయిన్లతో పోల్చితే తక్కువ కాలమే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకొని ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రియమణి త్వరలోనే ఓ శుభవార్త చెబుతానంటూ సోషల్ మీడీయాలో పొస్ట్ చేసింది. కెరీర్ బాగా ఉన్నప్పుడే ప్రియమణి ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ముస్తఫారాజ్ ను ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలు చేయకపోయినా, బుల్లి తెరపై సందడి చేస్తోంది. తాజాగా తన భర్తతో కలసి ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతే కాదు, త్వరలోనే ఓ విషయాన్ని చెబుతానంటూ జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే, ఫొటోను క్లియర్ గా గమనిస్తే… ఆమె గర్భవతి అయినట్టు కనిపిస్తోంది. ప్రియమణి తల్లి కాబోతోందని నెటిజన్లు ఓ అంచనాకు వస్తున్నారు.