జగన్ పాదయాత్ర @ 225వ రోజు

వాస్తవం ప్రతినిధి: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 225వ రోజు కు చేరుకొంది. జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం విరవ శివారు నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర విరవాడ, ఎఫ్‌కే పాలెం, కుమారపురం మీదుగా పిఠాపురం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సాయంత్రం పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.