చైనా కంపెనీ వినూత్న కార్యక్రమం…..టాయిలెట్ లో అన్నం ముద్దలు వేసుకొని తిన్నారు!

వాస్తవం ప్రతినిధి: వింతలు విశేషాలు ఏమైనా ఉన్నాయి అంటే ఎక్కువగా చైనా దేశంలోనే చాలా చూస్తుంటాం. వినూత్నంగా ఆలోచించినా కూడా చైనా ముందంజ లో ఉంటుంది. అయితే చైనా కు చెందిన ఒక కంపెనీ శుభ్రతపై తమకున్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించడానికి ఏం చేసిందో తెలుసా? తెలుసుకుంటే మాత్రం మీకు ఈ రోజు భోజనం సహించదు కూడా. ఎందుకంటే ఏదైనా నోట్లో పెట్టుకొని బాత్ రూమ్ లోకి వెళ్లడానికే చిరాకు పడతాం. అలాంటిది టాయిలెట్‌లో అన్నం ముద్దలు వేసుకుని మరీ తిన్నారు. తమ కంపెనీలో టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతామని.. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ మేనేజర్ తెలిపారు. ఈ నేపధ్యంలో కంపెనీ ఉద్యోగులకు టాయిలెట్ల శుభ్రతపై నమ్మకం కలిగించేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. దీనితో సుమారు 20 మంది ఉద్యోగులు టాయి లెట్ లో వేసిన అన్నం ముద్దలను తినేశేయడమే కాకుండా అదే టాయిలెట్ గదిలో డైనింగ్ టేబుల్ వేసుకుని మరి భోజనం చేశారు.