కరుణానిధి త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థించాం: శరత్‌కుమార్

వాస్తవం సినిమా: తిరుమల శ్రీవారిని రాధికా శరత్‌కుమార్ దంపతులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో వారు ఆలయానికి వచ్చారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచంన, శ్రీవారి శేష వస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్ మాట్లాడారు. తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి కోలుకుంటున్నారని ఆయన తెలిపారు. సోమవారం ఆయన్ను తాను పరామర్శించానని తెలిపారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని శ్రీవారిని ప్రార్థించినట్టు శరత్‌కుమార్ తెలిపారు.