అనేక భవనాలు,ఇళ్లను దహించివేస్తున్న కార్చిచ్చు

వాస్తవం ప్రతినిధి: అమెరికాలోని కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు  రోజు రోజుకు అనేక భవనాలు, ఇళ్లను దహించి వేస్తోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక, విపత్తు నివారణ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. శాంటాక్లారిటాలో హెలికాఫ్టర్లు, అగ్నిమాపక శకటాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో చిన్నచిన్న పట్టణాల వైపు విస్తరిస్తున్న దావానలం కార్లు, భవంతులను బూడిద చేస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల నుంచి 15వేల మందిని ఖాళీ చేయించారు. ఇప్పటివరకు ఈ మంటల కారణంగా ఆరుగురు మృత్యువాత పడగా, 723 ఇళ్లు కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలానే ఈ ఘటనలో మరో 18 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.