‘శైలజా రెడ్డి అల్లుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్

వాస్తవం సినిమా: మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా రూపుదిద్దుకొంటున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా విడుదల తేదీ ఖరారు చేసింది చిత్ర బృందం.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నారు.దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించగా, కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. రీసెంట్ గా షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ సినిమాలో నిలువెల్లా అహంభావం కలిగిన అత్తగారి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. పొగరుబోతు కూతురిని సపోర్ట్ చేస్తూ .. అల్లుడిని ఆడించాలనుకుంటుంది. ఆమె ఆటలు సాగనీయని పాత్రలో చైతూ కనిపించనున్నాడు. గతంలో ఈ తరహా కథలు వచ్చినా .. ట్రీట్మెంట్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని మారుతి చెబుతుండటం విశేషం.