వియత్నాం లో ఘోర ప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెండ్లి బృందం తో వెళుతున్న వ్యాను ఒకటి ప్రమాదానికి గురికావడం తో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణ వియత్నాం లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందినవారే కావడం గమనార్హం. 16 సీట్ల సామర్థ్యం ఉన్న వ్యానులో పెళ్లి కొడుకు కుటుంబం పెళ్లి కూతురు ఇంటికి బయలేదేరింది. ఈ నేపధ్యంలో దక్షిణ వియత్నాంలోని క్వాంగ్ నామ్‌కు సమీపంలో పెళ్లి బృదం ప్రయాణిస్తున్న వ్యాను కంటెయినర్ ట్రక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనితో ఈ ప్రమాదంలో 13 మంది స్పాట్‌లోనే చనిపోగా..మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచినట్లు అక్కడి అధికారులు తెలిపారు.