విజయ్ అందరూ అనుకునేటట్లు చెడ్డవాడు కాదు: అల్లు అరవింద్

వాస్తవం సినిమా: విజయ్ అందరూ అనుకునేటట్లు చెడ్డవాడు కాదని అంటున్నాడు అల్లు అరవింద్. విజయ్ తనను తాను రౌడీ అని పిలుచుకుంటాడే తప్ప నిజానికి అతను చాలా మంచి వాడని చెప్పాడు. నిజాయితీగా ఏదనుకుంటే అది మాట్లాడటం అతడి నైజమని అరవింద్ అన్నాడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘గీత గోవిందం’ పాటల విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. పరశురామ్‌ దర్శకుడు. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. గోపీసుందర్‌ స్వరకర్త. తొలి సీడీని ఆవిష్కరించిన అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. విజయ్ తన మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ గురించి వేదిక మీద మాట్లాడి.. తనపై తాను జోకులు వేసుకుని.. జనాల్ని ఎంటర్టైన్ చేయడం.. దాన్ని కూడా ప్రమోషన్లో భాగం చేయడం అన్నది అతని తెలివితేటలకు నిదర్శనమని అరవింద్ చెప్పాడు. అతను గ్రేట్ పెర్ఫామర్ అని కూడా విజయ్ కితాబిచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన వారానికి ‘గీత గోవిందం’ మొదలైందని.. ‘అర్జున్ రెడ్డి’ సాధించిన విజయం చూసి తామంతా కొంచెం కంగారు పడ్డామని.. ఆ సినిమాతో విజయ్ ఇమేజ్ మారిపోయిన నేపథ్యంలో విజయ్ కి ‘గీత గోవిందం’ సూటవుతుందా అని సందేహించామని.. కానీ ఏ పాత్రనైనా పండించగల నైపుణ్యం ఉన్న హీరో తమకున్నాడన్న ధైర్యంతో ఏ మార్పులూ చేయకుండా ముందు ఎలా అనుకున్నామో అలాగే ఆ పాత్రను ఉంచి షూటింగ్ కొనసాగించామని అరవింద్ వెల్లడించాడు.