వర్షం కారణంగా రద్దైన కోహ్లీ సేన ప్రాక్టీస్ సెషన్

వాస్తవం ప్రతినిధి: తొలి టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ సేన ప్రాక్టీస్‌ రద్దయ్యింది. షెడ్యుల్ ప్రకారం ఆదివారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనాల్సి ఉండగా, వర్షం కారణంగా మొత్తం ప్రాక్టీస్ సెషన్ రద్దైనట్లు తెలుస్తుంది. చెమ్స్‌ఫోర్డ్‌లో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ముగించుకుని కోహ్లీ సేన ఆదివారం బర్మింగ్‌హామ్‌ చేరుకుంది. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ బుధవారం(ఆగస్టు 1న) నుంచి ప్రారంభంకానుంది. బర్మింగ్‌ హామ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఆదివారం తొలి టెస్టు జరిగే మైదానంలో ప్రాక్టీస్‌ చేద్దామనుకుంటే వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మొత్తం ప్రాక్టీస్‌ సెషనే రద్దవ్వడంతో ఆటగాళ్లు హోటల్‌ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పిచ్‌పై ప్రాక్టీస్‌ చేసేందుకే భారత్ నాలుగు రోజుల సన్నాహక మ్యాచ్‌ను మూడు రోజులకు తగ్గించింది. కానీ, వరుణుడు మాత్రం అడ్డుపడ్డాడు.