రష్యా నావికాదళ దినోత్సవ వేడుకల్లో తప్పిన భారీ ప్రమాదం 

వాస్తవం ప్రతినిధి: రష్యా నావికాదళ దినోత్సవ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.  ఇవాన్‌ పాస్కో అనే గస్తీ నౌక ఒకటి ఈ నావికాదళ వేడుకల్లో పాల్గొంది. అయితే ఈ క్రమంలో సెల్ఫ్ ప్రోపెల్ద్ శతఘ్నికి అమర్చిన ఈ నౌక అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. ఈ నేపధ్యంలో ఆ నౌక ఫాస్ట్‌ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ వంతెన గోడను బలంగా ఢీకొనడం తో ఈ ఘటన చోటుచేసుకుంది. దళాలను వేగంగా యుద్ధభూమికి చేర్చడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చన ఇవాన్‌పాస్కో మార్గమధ్యలో అదుపుతప్పి ఒకవైపునకు దూసుకెళ్లి వంతెన పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వంతెన పిల్లర్‌ , నౌక పాక్షికంగా దెబ్బతిన్నాయి. సెరీనా క్లాస్‌ నౌకలను రష్యా 1994-2014 వరకు తయారు చేసింది. రష్యా నావికాదళంలో ఇటువంటివి దాదాపు 12 ఉన్నాయి. ఈ క్రమంలో ఒక నౌక వంతెన పిల్లర్ ని డీ కొన్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా జరిగిన ఈ నావికాదళ దినోత్సవ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా పాల్గొన్నారు. మొత్తం 40నౌకలు, 40 హెలికాఫ్టర్లు, 40 యుద్ధవిమానాలు దీనిలో పాల్గొన్నాయి.