భారత విద్యార్ధి దారుణ హత్య….19 ఏళ్ల అమ్మాయిపై హత్యా కేసు నమోదు!

వాస్తవం ప్రతినిధి: ఆస్ట్రేలియాలో గ‌త‌వారం భారత విద్యార్థి మాలిన్ రాథోడ్ (25) దారుణంగా చంపబడిన విష‌యం తెలిసిందే. డేటింగ్ సైట్ లో ప‌రిచ‌య‌మైన జామి లీ ని కలవాడానికి వెళ్ళిన మాలిన్ రాథోడ్ హ‌త్య‌కు గురయ్యాడు. ఈ నేపధ్యంలో అతడి మృతికి కారకురలైంది అని  జామి లీ(19) అనే అమ్మాయిపై ఆస్ట్రేలియా పోలీసులు హత్యాకేసును న‌మోదు చేశారు. జామి లీని పోలీసులు క‌స్ట‌డీకి త‌ర‌లించారు. న‌వంబ‌ర్ 19న మ‌రోసారి కోర్టులో హాజ‌రుప‌ర్చ‌నున్నారు. మాలిన్ రాథోడ్ అసాధార‌ణ ప‌రిస్థితుల్లో చ‌నిపోవ‌డం వ‌ల్ల మ‌రికొన్ని చ‌ట్ట‌ప‌ర‌మైన లాంఛ‌నాల‌ను పూర్తి చేయాల్సి ఉంద‌ని, మాలిన్ రాథోడ్ మృతదేహం భార‌త్ రావ‌డం, అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించడానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని ఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. మాలిన్ రాథోడ్ జులై 23న పశ్చిమ మెల్‌బోర్న్‌లోని సన్‌బరీ సబర్బ్ ప్రాంతంలో ఉన్న తన స్నేహితురాలు జామి లీ కలవడానికి ఆమె ఇంటికి వచ్చాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో స్నేహితురాలి ఇంటి వద్ద తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. సమాచారమందుకున్న అత్యవసర విభాగం అక్కడకు చేరుకుని మాలిన్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.