బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, శ్యామల!

వాస్తవం సినిమా: బిగ్ బాస్ సీజన్ 2లో గత రాత్రి జరిగిన ఎపిసోడ్ లో అనుకోనిదే జరిగింది. ప్రతి వారాంతంలో హౌస్ నుంచి ఎవరో ఒకరు ఎలిమినేషన్ కావటం తెలిసిందే. ఈ వారం అందుకు భిన్నంగా.. ఎవరినీ ఎలిమినేట్ చేయకుండా.. ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు బిగ్ బాస్.
అందరూ అనుకొన్నట్లుగానే నూతన్ నాయుడు, శ్యామల హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. వీరికోసంగా బిగ్ బాస్ హిస్టరీలో ఎన్నడూ రాని విధంగా ఓట్ల వర్షం కురిసింది. నూతన్ నాయుడికి శ్యామల కన్నా కాసిన్ని ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ఈ ఇద్దరూ హౌస్ లోనికి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు హోస్ట్ నాని ప్రకటించాడు.
ప్రేక్షకులు ఓట్లు అయితే వేశారు కానీ.. వారిని హౌస్ లోకి ఎప్పుడు పంపాలన్న అంశంపై నిర్ణయాన్ని బిగ్ బాస్ తీసుకుంటారని ప్రకటించారు నాని. ఎప్పుడు ఏమైనా జరగొచ్చంటూ మొదట్నించి చెబుతున్నట్లే.. ఇద్దరు హౌస్ మేట్స్ ను రీఎంట్రీ ఇవ్వాలన్న అంశం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.