ప్రధాని మోదీ కి ఫ్రెంచ్ సైబర్ నిపుణుడు ఆండర్సన్‌ సవాల్‌

వాస్తవం ప్రతినిధి: ఆధార్ విషయంలో సాగుతున్న చర్చోపచర్చల వాదాల యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది.టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ, తన ఆధార్ సంఖ్యను బహిర్గతం చేస్తూ,ఇదీ నాఆధార్ నంబర్.. దమ్ముంటే నా వివరాలు చెప్పండి! అంటూ సవాల్ విసరగా… ఫ్రెంచ్ సైబర్ నిపుణుడు, స్వయం ప్రకటిత హ్యాకర్ ఇలియట్ ఆండర్సన్, ఆయనకు సంబంధించిన కీలక అంశాలను తెరమీదకు తీసుకువవచ్చారు. దీంతో..ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అయింది.
ఆపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధార్ నంబర్ వెల్లడించాలని, అప్పుడు తాను ఆధార్ వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో వెల్లడిస్తానని సవాల్ విసిరారు. గత కొన్ని నెలలుగా ఆధార్ అనుసంధానిత వ్యవస్థపై ఆయన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఆధార్ సంఖ్య ఆధారంగానే ఆండర్సన్.. శర్మ గురించిన వివరాలు బయట పెట్టారని చెప్పడం అవాస్తవమని ఉడాయ్ వెల్లడించింది. నెట్టింట్లో సెర్చ్ చేసి ఈ వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.