చిరూ 152వ సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఎవరిని వరిస్తుందో ..?

వాస్తవం సినిమా: ఉయ్యాలవాడ నరసిమ్హా రెడ్డి చారిత్రక కథా నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా .. ఆయన 151వ సినిమాగా ‘సైరా’ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు.. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ .. ఎమోషన్ కూడిన ఒక సందేశాత్మక చిత్రాన్ని ఆయన చిరంజీవితో రూపొందించనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ఆరంభించాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకోవాలనే విషయంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ‘సైరా’లో నయనతార చేస్తోంది .. అందువలన అనుష్క .. త్రిష .. శ్రియ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దింపే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు. చిరూ 152వ సినిమాలో కథానాయికగా ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.