కొత్త హెయిర్ స్టైల్ తో ధోనీ!

వాస్తవం ప్రతినిధి: ఎప్పుడూ కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ తో అభిమానులకు ఫ్యాషన్ ఐకాన్ గా నిలుస్తున్న మాజీ టీమిండియా సారధి మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు మరో స్టైల్ కి తెరతీశాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో తెల్లటి గడ్డంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచిన ధోనీ తాజాగా కొత్త హెయిర్‌ స్టైల్‌తో కనిపించాడు. ఈ కొత్త లుక్‌ అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో వారు ధోనీ కొత్త హెయిర్‌ స్టైల్‌కు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. ప్రస్తుతం ధోనీ చేయించుకున్న ఈ కొత్త హెయిర్‌ స్టైల్‌ పేరేంటంటే.. ‘వీ హాక్‌’. ఇంగ్లాండ్‌ పర్యటన ముగించుకుని వచ్చిన ధోనీ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌‌ వద్ద ఈ కొత్త హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడట. అనంతరం సెలూన్‌ నిర్వాహకులు ధోనీ ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి.