అరవింద సమేత నుండి మరో సీన్ లీక్

వాస్తవం సినిమా: ‘ అరవింద సమేత ‘ సినిమా షూటింగ్ సెట్ లో ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా, లీకుల పర్వం మాత్రం ఆగడంలేదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేతలో ఇటీవలే ఓ సీన్ లీక్ కావడంతో.. దర్శకుడు త్రివిక్రమ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. సెట్స్ లోకి ఎవరు సెల్ తీసుకురావద్దని హుకుం జారీ చేశాడు. ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇలా ఆంక్షలు విధించిన కొన్ని రోజుల్లోనే మరో సీన్ లీక్ అయింది. ఎన్టీఆర్ రాయలసీమ యువకుడి గెటప్ లీక్ అయింది. వైట్ కలర్ కుర్తా, బ్లూ కలర్ జీన్స్ వేసుకున్న ఎన్టీఆర్ సింపుల్ గా ఉన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో హల్చల్ చేస్తున్నది. చాలా కాలం తరువాత ఎన్టీఆర్ రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉండటంతో పాటు మధ్యమధ్యలో ఇలాంటి లీక్ ల వలన సినిమాకు మరింత హైప్ వస్తున్నది. దసరాకు ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.