బీహార్ లో రావణ-దుర్యోధన పాలన సాగుతోంది: తేజస్వీ

వాస్తవం ప్రతినిధి: బిహార్‌లో రావణ-దుర్యోధన పాలన సాగుతోందని ఆర్జేడీ నేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ మండిపడ్డారు. బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌లోని బాలికల వసతి గృహంలో 34 మంది మైనర్‌ బాలికలపై అక్కడి సిబ్బంది అత్యాచారాలకు పాల్పడిన ఘటన ఇటీవల వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తేజస్వీ నితీశ్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, రావణ-దుర్యోధనుడిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని శనివారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు  పూర్తిగా క్షిణించిపోయాయని, ఆడ పిల్లలు బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారని తేజస్వీ వ్యాఖ్యానించారు.