బాబు గోగినేనిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నాని!

వాస్తవం సినిమా: బిగ్ బాస్ 2లో ఏమైనా జరగవచ్చు అన్నట్లు రోజు రోజు కూ చిత్ర.. విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. షోలో కంటెస్టెంట్స్ తో ఐదు రోజులు ఒక మాదిరి.. వారాంతంలో ఒక మాదిరి అన్న చందంగా ఉంది. ఆ మధ్యన బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ తీరుపై క్లాస్ పీకిన నాని.. మరోసారి బెత్తం పట్టుకున్న టీచర్ ను తలపించేలా క్లాస్ పీకాడంటూ నాని పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో వివాదం, సభ్యులు గ్రూపులు కట్టడం, బాబు గోగినేని అనుచిత వ్యాఖ్యలపై నాని ఘాటుగా స్పందించాడు. ముఖ్యంగా బాబు గోగినేనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కెప్టెన్సీ టాస్క్ అనంతరం బాబు-గీతామాధురి మధ్య జరిగిన గొడవ విషయంలో బాబుపై నాని మండిపడ్డాడు. మందలించాడు. దీప్తి గెలవడం మీకు ఇష్టం లేదన్న విషయం మీ చేష్టల ద్వారానే అర్థం అవుతోందన్న నాని… గ్రూపులు కట్టి అందరినీ ప్రభావితం చేస్తున్నారన్నాడు.
సిల్లీ గొడవలకు చిరాకు పడుతున్న జనాలకు.. నాని క్లాసుల పరంపర మరింత మండేలా చేస్తోంది. వాతావరణం వేడెక్కి ఉన్న వేళలో.. సూచనల్ని చాలా సింఫుల్ గా చెబుతూ.. ఏదైనా తప్పులు చేస్తుంటే.. దానికి సంబంధించి సలహాలు ఇవ్వాలంటే సున్నితమైన మాటలతో చెప్పాల్సింది పోయి.. ముఖం గంటు పెట్టుకొని.. పై నుంచి కింద వరకూ క్లాస్ పీకటమే థ్యేయమన్న రీతిలో నాని వ్యవహరిస్తున్నారంటూ నెట్టింట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.