తిరుమల శ్రీ వెంకటేశ్వరుని హుండీ ఆదాయంలో కొత్త రికార్డు

ILLUMINATED: A view of the Sri Venkateswara temple at Tirumala, dazzling with serial-lighting all over, on the eve of the annual Brahmotsavams. (Photo: KV Poornachandra Kumar)

వాస్తవం ప్రతినిధి: తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయ చరిత్రలో హుండీ ఆదాయం రికార్డులు బద్దలయ్యాయి. 2012లో శ్రీరామనవమి (ఏప్రిల్ 1) నాడు హుండీ ద్వారా వచ్చిన రూ. 5.73 కోట్ల ఆదాయం ఇంతవరకూ రికార్డు కాగా, తాజాగా ఈ నెల 26న గురువారం నాడు హుండీ ద్వారా రూ. 6.28 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆలయ చరిత్రలో పాత హుండీ ఆదాయ రికార్డులన్నీ బద్దలయ్యాయని అధికారులు ప్రకటించారు.

ఈ మొత్తం లో రూ. 1.64 కోట్ల చిల్లర నాణాలు ఉన్నాయని అన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు తరువాత 2017 ఆరంభంలో శ్రీవారి హుండీ ఆదాయం కొన్ని రోజుల పాటు రూ. 4 కోట్లను దాటుతూ వచ్చింది. అదే సంవత్సరం మార్చి 28న రూ. 5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది కూడా. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ గురువారం నాటి ఆదాయం దాటేసింది.