జట్టులోకి వచ్చిన తరువాత వార్తా పత్రికలూ చదవడమే మానేశా: శ్రేయాస్ అయ్యర్

వాస్తవం ప్రతినిధి: భారత జట్టులోకి వచ్చిన తరువాత వార్తా పత్రికలు చదవడం మానేశాడట మన భారత యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. వార్త పత్రికలు చదవొద్దని తనకు ధోని సలహా ఇచ్చాడని ఆ యువ క్రికెటర్ చెబుతున్నాడు. ‘‘భారత జట్టులో చేరిన తర్వాత వార్తా పత్రికలు చదవడం మానెయ్యాలని, సామాజిక మాధ్యమాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ధోనిచెప్పాడు. వాటి విషయంలో జాగ్రత్తపడుతున్నా’’ అన్నాడు. తనకు ముందు నుంచి తెలిసిన ఒక అమ్మాయి ఐపీఎల్‌ వేలంలో తర్వాత తనకు దగ్గరవ్వాలని ప్రయత్నించిందని శ్రేయస్‌ చెప్పాడు. ‘‘ముందెప్పుడూ నా గురించి ఆమె పట్టించుకోలేదు. వేలం తర్వాత  మాట్లాడడానికి బాగా ప్రయత్నించింది. ఆమె డబ్బు చూసి వచ్చిందని నాకు అర్థమైంది అని కొన్ని వ్యక్తిగత విషయాలను తెలిపాడు శ్రేయాస్ అయ్యర్.