జగన్ వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ!

వాస్తవం ప్రతినిధి: కాపు రిజర్వేషన్ల అంశంపై తాను హామీ ఇవ్వలేనని ఇటీవల వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ వ్యాఖ్యలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చడం రాష్ట్ర పరిధిలో లేదు..కేంద్ర పరిధిలో ఉందనడం దారుణమని, తుని సంఘటన సమయంలో తమకు మద్దతిచ్చిన జగన్, ఇప్పుడిలా మాట్లాడటం సరికాదని ముద్రగడ వ్యాఖ్యానించారు. తమకు ప్రత్యేక కేటగిరీ పెట్టి కొంత సాయం చేయమన్నాం కానీ, మిగతా కులాలకు నష్టం చేయమనలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పరిధిలో ఉన్న అంశాలపై పోరాడుతున్న జగన్ కు ఈ అంశం సాధ్యం కాదా? అని ముద్రగడ ప్రశ్నించారు. జగన్ తన  పాదయాత్రలో ఇచ్చే హామీలు నెరవేరాలంటే కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని, తమ జాతి సమస్య తీర్చలేనప్పుడు జగన్ కు తాము ఎందుకు ఓట్లు వెయ్యాలి? అని ప్రశ్నించారు.