కరుణానిధిని పరామర్శించిన వెంకయ్యనాయుడు

వాస్తవం ప్రతినిధి: చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు పరామర్శించారు. కుమారుడు స్టాలిన్ ని అడిగి కరుణానిధి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ కూడా కరుణానిధిని పరామర్శించారు.
మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణ.. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి 8మంది డాక్టర్లు శ్రమిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ రాష్ర్టవ్యాప్తంగా డీఎంకే నేతలు, కార్యకర్తలు పూజలు చేస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.