ఈషా రెబ్బా స్పీడ్ మామూలుగా లేదుగా

వాస్తవం సినిమా :తెలుగు తెరపై తెలుగు అమ్మాయిలు రాణించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. తెలుగు అమ్మాయిలు కూడా ఇక్కడ దూసుకుపోగలరని నిరూపించాలనుకుందేమో గానీ .. ఈషా రెబ్బా వరుస అవకాశాలు అందుకుంటూ వెళుతోంది. అంతకు ముందు ఆమె రెండు .. మూడు సినిమాలు చేసినా, ‘అమీతుమీ’ .. ‘అ!’ సినిమాలతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఆమె తాజా చిత్రంగా వచ్చే నెల 3వ తేదీన ‘బ్రాండ్ బా బు ‘ రానుంది.

‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ఎన్టీఆర్ జోడీగాను చేస్తోన్న ఈ అమ్మాయి, తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాజా అనే దర్శకుడు నాగశౌర్య హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో జగపతిబాబు హీరోగా చేసిన ‘ఆయనకి ఇద్దరు’ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బా ను తీసుకున్నారట. ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందనీ .. ఆమె మరింత బిజీ అవుతుందని అంటున్నారు. అక్టోబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.