ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నే అధికారంలోకి వస్తుంది: ఉత్తమ్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ సర్వేలో తేలింది అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ శివారు బోడుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్,సర్వే సత్యనారాయణ తదితర నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉత్తమ్ మాట్లాడుతూ….కేసీఆర్ తన కుటుంబానికి అనుకూలంగా వ్యవస్థను మార్చుకున్నారని, తెలంగాణా లో కేవలం కేసీఆర్ కుటుంబంలోని నలుగురు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఆయన విమర్శించారు. దోచుకోవడం-దాచుకోవడమే కేసీఆర్ కుటుంబం పని అని ఆరోపించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ సమక్షంలో టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.