‘అమర్ అక్బర్ ఆంటోని’ తదుపరి షెడ్యూల్   కూడా అమెరికాలోనే

వాస్తవం సినిమా: శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇలియానా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఇంతకుముందు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించి తిరిగి వచ్చారు. తదుపరి షెడ్యూల్ ను కూడా అమెరికాలోనే ప్లాన్ చేశారు.

వచ్చేనెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకూ అక్కడ షూటింగ్ జరగనుంది. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు .. పాటలను అక్కడ చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో క్రితంసారి జరిగిన షెడ్యూల్లో ఇలియానా పాల్గొంది. తదుపరి షెడ్యూల్ కోసం ఇలియానా కూడా అమెరికా చేరుకోనుంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కమెడియన్ గా సునీల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.